విఖానసాచార్యుల సన్నిధికి మలయప్పస్వామి
ABN , Publish Date - Aug 30 , 2026 | 01:58 AM
తిరుమల ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి శనివారం ఉత్తరమాడవీధిలోని విఖానసాచార్యుల సన్నిధికి వేంచేశారు. విఖనస మహర్షి జయంతి శ్రావణ పౌర్ణమిరోజున జరిగిన విషయం తెలిసిందే.
తిరుమల, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి శనివారం ఉత్తరమాడవీధిలోని విఖానసాచార్యుల సన్నిధికి వేంచేశారు. విఖనస మహర్షి జయంతి శ్రావణ పౌర్ణమిరోజున జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరుసటి రోజు శ్రీవారి ఉత్సవమూర్తులు విఖనసాచార్యుల సన్నిధికి వేంచేయడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం నిత్య కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి.ఈ వైఖానస ఆగమశాస్ర్తాన్ని విఖనస మహర్షి రచించారు. సాయంత్రం సహస్ర దీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి విఖానసాచార్యుల సన్నిధికి వేంచేసి ఆస్థానం అనంతరం నివేదన చేపట్టారు.శ్రీవారి ఆలయ పారుపత్తేదారు బాలసుబ్రహ్మణ్యం, విఖనస ట్రస్టు కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.