Share News

చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో మలయప్ప

ABN , Publish Date - Oct 19 , 2026 | 02:10 AM

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించారు. వేణుగాన లీలలను స్ఫురింపజేసే శ్రీకృష్ణుడి నర్తన రూపం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది

చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో మలయప్ప

తిరుమల,అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి):శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహించారు. వేణుగాన లీలలను స్ఫురింపజేసే శ్రీకృష్ణుడి నర్తన రూపం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.చంద్రుని శీతల కాంతులు, శ్రీకృష్ణుడి లీలామాధుర్యం, శ్రీవారి దివ్య తేజస్సు మేళవించిన ఈ వాహనసేవ తిరుమలలో ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ వాహనసేవ 9.22 గంటలకు ముగిసింది.టీటీడీ జీయర్‌స్వాములు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో సూర్యమండల మధ్యవర్తిగా వెలుగొందుతున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్వామివారికి ఆస్థానం వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవను సాధారణంగా రెండు గంటల పాటు నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మాడవీఽధుల్లో వాహనాలను ఊరేగిస్తారు. అయితే గ్యాలరీల్లోకి చేరే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా టీటీడీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. గ్యాలరీల్లోని ప్రతి భక్తుడూ సంతృప్తిగా స్వామిని దర్శించేలా నెమ్మదిగా వాహనసేవను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం సూర్యప్రభవాహనం 40 నిమిషాలు, రాత్రి చంద్రప్రభవాహనం 22 నిమిషాల పాటు అదనంగా ఊరేగించారు.కాగా సోమవారం ఉదయం 7గంటలకు స్వర్ణరథంలో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. రాత్రి అశ్వవాహనంపై కల్కి రూపంలో స్వామివారు అనుగ్రహిస్తారు.దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు ముగుస్తాయి. మంగళవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

Updated Date - Oct 19 , 2026 | 02:10 AM