Share News

బంగారు నగల దుకాణంలో భారీ చోరీ

ABN , Publish Date - Jul 24 , 2026 | 12:30 AM

పులిచెర్ల మండలం కల్లూరులోని ఓ బంగారు నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు... కల్లూరుకు చెందిన సతీష్‌కుమార్‌ పుంగనూరు రోడ్డులో బంగారు, వెండి నగల దుకాణం నడుపుతున్నారు.

 బంగారు నగల దుకాణంలో భారీ చోరీ
దుకాణాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ వెంకటనారాయణ

314 గ్రాముల బంగారు, 20 కేజీల వెండి వస్తువుల అపహరణ

చోరీ సొత్తు విలువ రూ.36.40 లక్షలుగా గుర్తింపు

కల్లూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలం కల్లూరులోని ఓ బంగారు నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు... కల్లూరుకు చెందిన సతీష్‌కుమార్‌ పుంగనూరు రోడ్డులో బంగారు, వెండి నగల దుకాణం నడుపుతున్నారు. ఈనెల 17వ తేదీ రాత్రి ఎప్పటిలాగే దుకాణం మూసుకుని ఇంటికి వచ్చారు. మర్నాడు ఉదయం వచ్చి చూడగా దుకాణం తలుపులు తెరిచి ఉన్నాయని సతీష్‌కుమార్‌ గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా 314 గ్రాముల బంగారు నగలు, 20 కేజీల వెండి వస్తువులను చోరీ అయ్యాయి. వీటి విలువ రూ.36.40లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. చోరీ ఘటనపై ఆందోళన చెందిన సతీష్‌కుమార్‌ తండ్రి రాజేంద్రశెట్టి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో బాధిత వ్యాపారి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకటనారాయణ చేరుకుని దుకాణాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం వేలి ముద్రలను సేకరించింది. ఈ ఘటనపై 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - Jul 24 , 2026 | 12:30 AM