Share News

డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:40 AM

తాము ప్రయాణిస్తున్న బస్‌ నుంచి పెద్ద శబ్దం వెలువడటంతో ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు.

డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన పెనుముప్పు
ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు

వాల్మీకిపురం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తాము ప్రయాణిస్తున్న బస్‌ నుంచి పెద్ద శబ్దం వెలువడటంతో ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. కొద్ది క్షణాల్లోనే బస్‌ పక్కకు ఒరిగిపోతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ప్రాణనష్టం జరగని ఈ సంఘటన వివరాలు ఇలా..మదనపల్లె నుంచి మంగళవారం ఉదయం 11గంటలకు తిరుపతికి నాన్‌స్టా్‌ప ఆర్టీసీ బస్‌ బయలుదేరింది. వాల్మీకిపురం సమీపాన జాతీయ రహదారిపై బస్సు ముందు చక్రం ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే డ్రైవర్‌ అప్పమత్తమయ్యాడు. పక్కనే ఉన్న కల్వర్టును బస్సు ఢీకొట్టించాడు. దీంతో బస్‌ ఒరిగిు నిలిచిపోయింది. ఆ సమయంలో 38మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 20మంది గాయపడ్డారు. డ్రైవర్‌ వెంకటేశ్వరరాజుతో పాటు మోహనరామిరెడి, మునిరెడ్డి, అంజనీకుమారి, శ్రీనివాసులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముగ్గురిని తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

Updated Date - Sep 23 , 2026 | 12:40 AM