Share News

మదనపల్లె ఫైల్స్‌ దహనం కేసు 27కు వాయిదా

ABN , Publish Date - Apr 14 , 2026 | 02:13 AM

మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దహనం కేసు ఈనెల 27వ తేదీకి వాయిదా పడింది.

మదనపల్లె ఫైల్స్‌ దహనం కేసు 27కు వాయిదా

చిత్తూరు లీగల్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఫైల్స్‌ దహనం కేసు ఈనెల 27వ తేదీకి వాయిదా పడింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో 2024లో ఫైల్స్‌ దహనం కేసులో తుకారాం, మాధవరెడ్డిలపై సీఐడీ పోలీసులు కేసు నమోదుచేసి రిమాండుకు తరలించారు. వీరు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. కేసు సోమవారం సీఐడీ కోర్టులో వాయిదా ఉండగా.. న్యాయమూర్తి బాబాజాన్‌ ఈ కేసును ఈనెల 27వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Apr 14 , 2026 | 02:13 AM