లక్కు.. కిక్కు
ABN , Publish Date - Oct 09 , 2026 | 02:00 AM
జిల్లాలో ఏ-4 కేటగిరిలోని 16 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా యజమానులను ఎంపికచేసి కేటాయించారు. రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 19 దుకాణాల్లో వి.కోటలో రెండు, కల్లుగీత కులానికి చెందిన ఓ దుకాణం మినహా మిగిలిన 16కు 74 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో గురువారం ఉదయం కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన 16 మద్యం దుకాణాలకు లక్కీ డిప్ నిర్వహించారు.
లాటరీ ద్వారా 16 మద్యం దుకాణాల కేటాయింపు
లైసెన్సు.. పర్మిట్ రూమ్ ఫీజు ద్వారా రూ.5.37 కోట్ల ఆదాయం
చిత్తూరు సెంట్రల్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏ-4 కేటగిరిలోని 16 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా యజమానులను ఎంపికచేసి కేటాయించారు. రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. మొత్తం 19 దుకాణాల్లో వి.కోటలో రెండు, కల్లుగీత కులానికి చెందిన ఓ దుకాణం మినహా మిగిలిన 16కు 74 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో గురువారం ఉదయం కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన 16 మద్యం దుకాణాలకు లక్కీ డిప్ నిర్వహించారు. లక్కీ డిప్‌ను కలెక్టరు తీయగా.. అందులోని దరఖాస్తు నెంబరు ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలను జిల్లా ఎక్సైజ్ అదికారి ఎస్.శ్రీనివాస్ ప్రకటించారు. ఆ ప్రకారం.. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో మద్యం దుకాణాలను జి.రవీంద్రనాయుడు, ఎ.వెంకటేశు, పి.విజయశేఖర్, జి.రవీంద్రనాయుడు, వి.నర్మదాశిరీష, వి.రూ్‌పసాగర్, శ్రీకాంత్, ఎం.ప్రణీత్, కె.సుకుమార్, యాదమరి మండలం పి.విజయశేఖర్, పూతలపట్టు మండలం ఎం.రాజేంద్రనాయుడు, ఇ.రజినీకాంత్, నిండ్ర మండలం జి.వెంకటేష్, వి.కోట మండలం బీఆర్ రాంబాబు, బైరెడ్డిపఎల్లె మండలం బీఎం కిశోర్, శాంతిపురం మండలం ఎస్.ప్రేమ్‌కుమార్‌కు దుకాణాలు కేటాయించారు. ఈ దుకాణాలకు సంబంధించి లైసెన్స్ ఫీజు, పర్మిట్ రూం ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ.5.37 కోట్ల ఆదాయం సమకూరినట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.