Share News

రాపూరు అడవిలో ప్రేమికుల బలవన్మరణం

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:08 AM

నెల్లూరు జిల్లాలోని రాపూరు-చిట్వేలు ఘాట్‌ రోడ్డులోని ఏడవ మైలు సమీపంలో గల దట్టమైన అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వీరిని ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న కుమార్‌, చిట్టమూరు మండలం చింతలతోపునకు చెందిన యాతగిరి సావిత్రిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు... మంగళవారం అటవీ ప్రాంతంలో తేనె సేకరణ కోసం వెళ్లిన పంగిలి గ్రామస్థులకు చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలు కనిపించాయి.పంగిలి వీఆర్వో సుధాకర్‌కు సమాచారం అందించగా, ఆయన ఎస్‌ఐ వెంకట రాజేష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందిని వెంట బెట్టుకుని ఘటనాస్థలికి చేరుకున్నారు. చెట్టు కింద ఓ హ్యాండ్‌ బ్యాగ్‌లో లభించిన మొబైల్‌ ఫోన్ల ఆధారంగా మృతుల వివరాలను సేకరించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలు సావిత్రికి ఇది వరకే వివాహమై ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు గుర్తించారు.మృతదేహాల సమీపంలో ఒక ద్విచక్ర వాహనం, పురుగు మందు డబ్బా లభించాయి. ముందుగా వారు పురుగు మందు తాగి, ఆపై చున్నీతో చెట్టుకు ఉరివేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.మృతుల వయసు సుమారు 25 సంవత్సరాలుండొచ్చని పోలీసులు తెలిపారు.

రాపూరు అడవిలో ప్రేమికుల బలవన్మరణం
చెట్టుకు వేలాడుతున్న ప్రసన్న కుమార్‌, సావిత్రి మృతదేహాలు

రాపూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు జిల్లాలోని రాపూరు-చిట్వేలు ఘాట్‌ రోడ్డులోని ఏడవ మైలు సమీపంలో గల దట్టమైన అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. వీరిని ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న కుమార్‌, చిట్టమూరు మండలం చింతలతోపునకు చెందిన యాతగిరి సావిత్రిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు... మంగళవారం అటవీ ప్రాంతంలో తేనె సేకరణ కోసం వెళ్లిన పంగిలి గ్రామస్థులకు చెట్టుకు వేలాడుతున్న రెండు మృతదేహాలు కనిపించాయి.పంగిలి వీఆర్వో సుధాకర్‌కు సమాచారం అందించగా, ఆయన ఎస్‌ఐ వెంకట రాజేష్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ తన సిబ్బందిని వెంట బెట్టుకుని ఘటనాస్థలికి చేరుకున్నారు. చెట్టు కింద ఓ హ్యాండ్‌ బ్యాగ్‌లో లభించిన మొబైల్‌ ఫోన్ల ఆధారంగా మృతుల వివరాలను సేకరించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలు సావిత్రికి ఇది వరకే వివాహమై ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు గుర్తించారు.మృతదేహాల సమీపంలో ఒక ద్విచక్ర వాహనం, పురుగు మందు డబ్బా లభించాయి. ముందుగా వారు పురుగు మందు తాగి, ఆపై చున్నీతో చెట్టుకు ఉరివేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.మృతుల వయసు సుమారు 25 సంవత్సరాలుండొచ్చని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 04 , 2026 | 01:08 AM