జోరుగా ‘సర్’
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:56 AM
ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఒక వ్యక్తికి ఒకచోటే ఓటు ఉండేలా చూడటమే సర్ లక్ష్యం. ఇందుకోసం బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, రెండు, మూడేసి నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన వారిని గుర్తించి.. జాబితాను సిద్ధం చేస్తున్నారు.
- మ్యాపింగ్‌లో జిల్లాకు ద్వితీయ స్థానం
ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఒక వ్యక్తికి ఒకచోటే ఓటు ఉండేలా చూడటమే సర్ లక్ష్యం. ఇందుకోసం బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి మృతులు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, రెండు, మూడేసి నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన వారిని గుర్తించి.. జాబితాను సిద్ధం చేస్తున్నారు.
- చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి
జిల్లాలో ‘సర్’ మూడు నెలల కిందట మొదలైంది. 22 ఏళ్ల కిందటి ఓటరు జాబితాతో ప్రస్తుత జాబితాను పోల్చి చూస్తున్నారు. అప్పట్లో ఉన్న ఓటర్లు ఇప్పుడూ ఉంటే వారిని మ్యాపింగ్ చేస్తున్నారు. వారి వారసులుంటే వారిని కూడా ఒకే పోలింగ్ కేంద్రం పరిఽధిలోకి తీసుకొస్తున్నారు. 65.08 శాతం మ్యాపింగ్ పూర్తిచేసి, రాష్ట్రంలోనే మన జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. నియోజకవర్గాల వారీగా.. పూతలపట్టులో 70.93 శాతం, గంగాధరనెల్లూరులో 70.49 శాతంతో ముందుండగా అతి తక్కువగా చిత్తూరులో 56.27 శాతం మాత్రమే మ్యాపింగ్ జరిగింది.
గడువంటూ లేదు
‘సర్’కు గడవుంటూ లేదు. అయినా ఈనెల 25వ తేదీలోగా జిల్లాలో మిగిలిన 36 శాతం మ్యాపింగ్‌ను పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. తుది జాబితా తయారీకి సన్నాహాలు చేస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా మ్యాపింగ్ వివరాలిలా
నియోజకవర్గం ఓటర్లు మ్యాపింగ్ శాతం
----------------------------------------------------------
నగరి 2,03,390 1,33,812 65.79
జీడీనె ల్లూరు 2,06,501 1,45,561 70.49
చిత్తూరు 2,03,678 1,14,602 56.27
పూతలపట్టు 2,22,265 1,57,659 70.93
పలమనేరు 2,71,316 1,73,456 63.93
కుప్పం 2,29,141 1,44,609 63.11