Share News

లోయలోకి దూసుకెళ్లిన లారీ

ABN , Publish Date - Oct 27 , 2026 | 01:44 AM

రామాపురం మండలంలోని కర్నూలు - చిత్తూరు 40వ జాతీయ రహదారిలోని గువ్వలచెరువు ఘాట్‌ 2వ మలుపు వద్ద సోమవారం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ దాస్‌(45) అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్‌ మహబూబ్‌బాషాకు తీవ్ర గాయాలయ్యాయి.

లోయలోకి దూసుకెళ్లిన లారీ
లోయలో పడి నుజ్జు నుజ్జు అయిన లారీ

రామాపురం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని కర్నూలు - చిత్తూరు 40వ జాతీయ రహదారిలోని గువ్వలచెరువు ఘాట్‌ 2వ మలుపు వద్ద సోమవారం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ దాస్‌(45) అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్‌ మహబూబ్‌బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. ఏపీ21టీవై 7960 నెంబర్‌ లారీలో నంద్యాల నుంచి పశువులు దాణాతో చిత్తూరు వైపు వెళుతోంది. అతివేగం కారణంగా రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్‌ 2వ మలుపు వద్ద అదుపు తప్పి పక్కనున్న లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ నంద్యాలకు చెందిన దాస్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. క్లీనర్‌ ఆళ్లగడ్డకు చెందిన మహబూబ్‌బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రామాపురం పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని 108 వాహనం ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. డ్రైవర్‌ దాస్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్‌ తెలిపారు.

Updated Date - Oct 27 , 2026 | 01:44 AM