విరుల పల్లకిపై విఘ్నరాజు విహారం
ABN , Publish Date - Oct 04 , 2026 | 01:34 AM
కాణిపాకం ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు పుష్ప పల్లకిపై విహరించారు. ఉదయం మూలవిరాట్‌కు ఉభయదారుల ఆధ్వర్యంలో తొలుత స్వామిని అభిషేకించాక చందనాలంకారాన్ని నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రా
ఐరాల(కాణిపాకం), అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కాణిపాకం ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు పుష్ప పల్లకిపై విహరించారు. ఉదయం మూలవిరాట్‌కు ఉభయదారుల ఆధ్వర్యంలో తొలుత స్వామిని అభిషేకించాక చందనాలంకారాన్ని నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకురాగానే అలంకార మండపంలో ఉత్సవ మూర్తులకు విశేష పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవమూర్తులను పుష్పపల్లకిపై ఆశీనులను చేశారు. మంగళ వాయిద్యాల నడుము పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి దివంగత భాగ్యలక్ష్మి, దామోదర్‌నాయుడుల కుటుంబ సభ్యులు, మోహన్‌నాయుడు,ఆయనసోదరురు,వీటీరాజ్‌న్ ఆయన సోదరులు, రామనాథంనాయుడు దివంగత రాజారెడ్డి, దివంగత కృష్ణమనాయుడి కుమారులు, నరసింహారెడ్డి కుమారులు,దివంగత శ్రీరాములురెడ్డి,బాలకృష్ణారెడ్డి కుటుంబీకులు, శేషయ్యనాయుడు, ఆయన కుమారులు,కుమరేంద్రచౌదరి, మనోహర్‌నాయుడు, సోదరులు, అంజినేయులునాయుడు, ఆయన కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్, ఏఈవోలు ఎస్వీ.కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనపాల్, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు,రవి, ఉభయదారులు పాల్గొన్నారు.
ఫ పుష్పపల్లకి సేవ సందర్భంగా అన్నవరం వీరవెంకటసత్యనారాయణ ఆలయం తరపున సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యశర్మ సిబ్బందితో కలసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పుష్పపల్లకి సేవ నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానికి 4 గంటల సమయం పట్టింది.
కాణిపాకంలో నేడు
ఆదివారం వరసిద్ధుడికి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి గాలిశేషాచలంనాయుడు, దివంగత శేషాద్రినాయుడి సోదరులు,దివంగత హనుమంతనాయుడి కుమారులు, దివంగత రామకృష్ణారెడ్డి కుమారులు, గురజాల పార్థసారథినాయుడు, దివంగత చల్లగుండ్ల దామోదరనాయుడి కుమారులు, గురుజాల ఆనందనాయుడు, సోదరులు, లంకిపల్లెమోహన్‌బాబులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.
నేడు మహాలడ్డూ వేలం
తెప్పోత్సవం ముగిశాక ఆలయ ఆస్థాన మండపంలో స్వామివారి 21 కేజీల మహాలడ్డూ ప్రసాదాన్ని వేలం వేయన్నుట్లు చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ శనివారం తెలియజేశారు. బ్రహ్మోత్సవాలు,ప్రత్యేక ఉత్సవాల నేపథ్యంలో లడ్డూను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. వేలం పాటలో పాల్గొన దలచినవారు రూ.50 వేలు ధరావత్తు చెల్లించాలి సూచించారు.