Share News

విమానంపై విఘ్ననాథుడి విహరం

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:21 AM

కాణిపాకంలో ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం వరసిద్ధుడు విమానంపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ఐరాలకు చెందిన దివంగత రామకృష్ణపిళ్ళై కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు.

విమానంపై విఘ్ననాథుడి విహరం

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం వరసిద్ధుడు విమానంపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి ఐరాలకు చెందిన దివంగత రామకృష్ణపిళ్ళై కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం వీరి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకంను నిర్వహించారు. రాత్రి ఉభయ వరస తీసుకురావడంతో అలంకార మండపంలో స్వామి ఉత్సవ విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవ విగ్రహాలను సప్పరంపై ఉంచి పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. కార్యక్రమంలో చైర్మన్‌ మణినాయుడు, ఆలయ ఈవో పెంచలకిషోర్‌, ఏఈవోలు రవీంద్రబాబు, ధనపాల్‌, ఆలయ సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి, ఉభయదారులు పాల్గొన్నారు.

వరసిద్ధుడికి వెండి పుష్పమాల

స్వయంభు కాణిపాక వరసిద్ధుడికి శనివారం కారంచేడుకు చెందిన మల్లయ్య,రాజ్యలక్ష్మి సుమారు కేజీ బరువు కలిగిన వెండి పుష్పమాలను బహూకరించారు. దీంతోపాటు అన్నప్రసాద కేంద్రానికి రూ.లక్ష విరాళంగా అందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లెకు చెందిన సోమసత్యశ్రీనివాసరావు అన్నప్రసాద కేంద్రానికి రూ.1,01,116 విరాళంగా అందించారు. దాతలను సూపరింటెంటెండ్‌ వాసు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఫకాణిపాకంలో నేడు

ఆదివారం వినాయకస్వామికి సూర్యప్రభ వాహన సేవను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 44బొమ్మసముద్రం గ్రామానికి చెందిన దివంగత రాజమ్మ,రాజశేఖర్‌నాయుడుల కుమారులు ఇంద్రసేనానాయుడు, లక్ష్మీపతినాయుడు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

Updated Date - Sep 27 , 2026 | 01:21 AM