జతకట్టిన ఒంటరి ఏనుగులు
ABN , Publish Date - May 13 , 2026 | 12:09 AM
రామకుప్పం అటవీప్రాంతంలో విడిపోయిన జంట ఏనుగులు తిరిగి జతకట్టాయి
రామకుప్పం అటవీప్రాంతంలో విడిపోయిన జంట ఏనుగులు తిరిగి జతకట్టాయి. నెల రోజులుగా జంటగా ఉంటూ అటవీ ప్రాంత సమీప పొలాల్లో రెండు ఏనుగులు దాడులు కొనసాగించాయి. ఆదివారం రాత్రి ఆ రెండు ఏనుగులు విడిపోయాయి. వాటిలో ఒకటి ననియాల సమీపంలో సంచరించింది. మామిడి చెట్ల కొమ్మలను విరిచేసి, వరిపైరును తొక్కేసింది. మరొకటి ముద్దనపల్లె బీట్‌లో సంచరించింది. అలా రెండు ఏనుగులు తిరుగుతూ.. సోమవారం రాత్రి కలుసుకున్నాయి. ఈ రెండు కలిసి ననియాల సమీపంలోని పొలాలు, తోటల్లో బీభత్సం సృష్టించాయి. మామిడి కొమ్మల్ని విరిచేస్తూ, వరిపైర్లను తొక్కుకుంటూ హల్‌చల్ చేశాయి. విషయం తెలసుకున్న అటవీ అధికారులు బేస్‌క్యాంపు సిబ్బందితో కలిసి వాటిని అడవిలోకి తరిమారు. అడవిలోకి వెళ్లిన జంట ఏనుగులు కనుమగట్టు వంక ప్రాంతంలో మకాం వేసినట్టు అటవీ అధికారులు గుర్తించారు. అటవీ విభాగాధికారి హరికుమార్ నేతృత్వంలో అటవీ అధికారులు, బేస్‌క్యాంపు సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం నుంచే అడవిలోకి చేరుకుని జంట ఏనుగులు గ్రామాలవైపు రాకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించారు.
- రామకుప్పం, ఆంధ్రజ్యోతి