Share News

ఒంటరి ఏనుగు వీరంగం

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:58 AM

:చంద్రగిరి మండలం బి.కొంగరవారిపల్లెలో ఒంటరి ఏనుగు ఆదివారం రాత్రి వీరంగం సృష్టించింది.

 ఒంటరి ఏనుగు వీరంగం
ఒంటరి ఏనుగు వీరంగంతో తిరగబడ్డ ట్రాక్టర్‌ ట్రాలీ

చంద్రగిరి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి):చంద్రగిరి మండలం బి.కొంగరవారిపల్లెలో ఒంటరి ఏనుగు ఆదివారం రాత్రి వీరంగం సృష్టించింది.ఆదివారం అర్ధరాత్రి మూడు ఏనుగులు యల్లంపల్లి పొలాల వద్దకు వచ్చాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ మూడు ఏనుగులను అడవిలోకి తరలించడానికి ప్రయత్నించారు. రెండు ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి కానీ ఒక ఏనుగు మాత్రం రోడ్డు దాటుతుండగా అటవీశాఖ సిబ్బంది బాణసంచా కాల్చి, డప్పులు వాయించారు. దీంతో ఆ ఏనుగు అటవీ సిబ్బందిపై తిరగబడడంతో భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. పంట పొలాలను, ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసిన ఆ ఏనుగు పొలంలో ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని పైకి ఎత్తి కిందకు వేసింది. చివరకు సోమవారం తెల్లవారు జామున గ్రామాల్లోకి ఏనుగును రాన్వికుండా అటవీ ప్రాంతంలోకి తరలించగలిగారు.

Updated Date - Apr 14 , 2026 | 01:58 AM