Share News

ఎమ్మెల్యేలకు లోకేశ్‌ విందు

ABN , Publish Date - Mar 04 , 2026 | 01:16 AM

టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్‌ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలకు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు.ప్రజాప్రతినిధులనూ, వారి కుటుంబసభ్యులనూ, పిల్లలనూ ఆత్మీయంగా పలకరించిన లోకేశ్‌ మహిళలకు మంగళగిరి చీరలు బహుకరించారు. అలాగే ప్రజాప్రతినిధులు, వారి కుటుంబీకులు తనకు అభిమానంగా అందజేసిన బహుమతులను, జ్ఞాపికలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారితో కలసి ఫొటోలు దిగారు. పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. భోజనాల సందర్భంలో తనే స్వయంగా అందరికీ ప్లేట్లు అందించారు.

 ఎమ్మెల్యేలకు లోకేశ్‌ విందు

తిరుపతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్‌ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలకు మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు.ప్రజాప్రతినిధులనూ, వారి కుటుంబసభ్యులనూ, పిల్లలనూ ఆత్మీయంగా పలకరించిన లోకేశ్‌ మహిళలకు మంగళగిరి చీరలు బహుకరించారు. అలాగే ప్రజాప్రతినిధులు, వారి కుటుంబీకులు తనకు అభిమానంగా అందజేసిన బహుమతులను, జ్ఞాపికలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారితో కలసి ఫొటోలు దిగారు. పిల్లలతో కొద్దిసేపు సరదాగా గడిపారు. భోజనాల సందర్భంలో తనే స్వయంగా అందరికీ ప్లేట్లు అందించారు. ఇంత సందడి వాతావరణంలోనూ మంత్రిగా, పార్టీ యువనేతగా అభివృద్ధి పనులు, నిధుల మంజూరు వంటి పలు సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనకు గతంలో ఇచ్చిన విజ్ఞాపనలకు సమాధానాలు లిఖితపూర్వకంగా అందజేశారు. అందులో సంబంధిత పనులు ఏ మేరకు జరిగాయి? జరగని వాటికి కారణాలు కూడా తెలియజేశారు. ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్‌రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ,నెలవల విజయశ్రీ, పాశం సునీల్‌ కుమార్‌ ,ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి కుటుంబసభ్యులతో హాజరయ్యారు.

Updated Date - Mar 04 , 2026 | 01:16 AM