Share News

ఎన్‌బీపీపీఎల్‌లో దొంగల ఆటోను పట్టుకున్న స్థానికులు

ABN , Publish Date - May 21 , 2026 | 02:09 AM

ఎన్‌బీపీపీఎల్‌ కర్మాగారంలో చోరీ చేసిన పరికరాలతో వెళుతున్న ఆటోను బుధవారం రాత్రి స్థానికులు పట్టుకున్నారు.

ఎన్‌బీపీపీఎల్‌లో దొంగల ఆటోను పట్టుకున్న స్థానికులు
ఆటోలో చోరీ చేసిన పరికరాలు

శ్రీకాళహస్తి రూరల్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఎన్‌బీపీపీఎల్‌ కర్మాగారంలో చోరీ చేసిన పరికరాలతో వెళుతున్న ఆటోను బుధవారం రాత్రి స్థానికులు పట్టుకున్నారు. మరో ఆటో పరారైంది. మరికొన్ని వాహనాలు కర్మాగారంలోపల ఉండవచ్చని గ్రామస్తులు చెప్పారు. 750 ఎకరాల పెద్ద కాంపౌండ్‌ కావడంతో చీకట్లో వెతకడం కష్టంగా ఉందన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. దీనిపై రూరల్‌ ఎస్‌ఐ వెంకటే్‌షను వివరణ కోరగా.. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులను పంపించామన్నారు. ఎన్‌బీపీపీఎల్‌ దొంగల గుట్టు రట్టు చేస్తామన్నారు. విచారణ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - May 21 , 2026 | 02:09 AM