రూ.16,037 కోట్లతో రుణ ప్రణాళిక
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:59 PM
గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): నాబార్డు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌పీ)ను రూపొందించింది. దీనిని గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆవిష్కరించారు. జిల్లాలో లభ్యమయ్యే వనరులను దృష్టిలో ఉంచుకుని నాబార్డు రుణ ప్రణాళికను రూపొందించింది. ప్రాధాన్యత రంగాల్లో రూ.16,037.64 కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించింది. వ్యవసాయం, ఎంఎ్‌సఎంఈ, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా జిల్లా ఆర్థికాభివృద్ధికి ఊతం కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. తొలుత నాబార్డు డీడీఎం సునీల్ రుణ ప్రణాళిక వివరాలను బ్యాంకర్లకు తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ ఇందిరా, ఎల్‌డీఎం హరీష్, రిజర్వు బ్యాంకు ఎల్‌డీవో రోహిత్, ఇతర బ్యాంకు కంట్రోలింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కేటాయింపులు ఇలా..
ఫ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ ఫార్మ్ క్రెడిట్ కింద రూ.9,410.96 కోట్లు కేటాయించారు. ఇందులో పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్, అనుబంధ కార్యకలాపాల వర్కింగ్ కేపిటల్ రుణాలకు రూ.6,056.61 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు టర్మ్ లోన్ పద్దు కింద రూ.3,354.35 కోట్లు కేటాయించారు.
ఫ వ్యవసాయ మౌలిక వసతులకు రూ.269.84 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు రూ.234.01 కోట్లు ప్రతిపాదించారు.
ఫ వ్యవసాయ రంగానికి రుణ ప్రణాళికలో పెద్దపీట వేస్తూ రూ.9,914.82 కోట్ల క్రెడిట్ సామర్థ్యాన్ని అంచనా వేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.34.39 కోట్లు, ఎగుమతి రుణాలకు రూ.630 కోట్లు, విద్యా రంగానికి రూ.351 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.449 కోట్లు, కేటాయింపులు చేశారు.
ఫ సామాజిక, మౌలిక వసతులకు రూ.77.12 కోట్లు, పునరుత్పాదక శక్తి రంగానికి రూ.986.40 లక్షలు, ఇతర రంగాలకు రూ.756.30 కోట్లు రుణ ప్రణాళికలో ప్రతిపాదించారు.