మద్యం దుకాణాలు ఫుల్
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:56 AM
తమిళనాడులో ఎన్నికల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో మద్యం షాపులు కిటకిటలాడుతున్నాయి. గురువారం ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మంగళవారం సాయంత్రం నుంచే తమిళనాడువ్యాప్తంగా మద్యం షాపులన్నీ మూతపడ్డాయి.
తడ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : తమిళనాడులో ఎన్నికల కారణంగా సరిహద్దు ప్రాంతాల్లో మద్యం షాపులు కిటకిటలాడుతున్నాయి. గురువారం ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మంగళవారం సాయంత్రం నుంచే తమిళనాడువ్యాప్తంగా మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. దీంతో మందుబాబులు సమీపంలోని తడ మద్యం షాపుల వైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా గుమ్మిడిపూడి, పొన్నేరి, ఎన్నూరువంటి ప్రాంతాలకు చెందిన వారు సూళ్లూరుపేట వైపు వెళ్లే లోకల్ రైళ్లల్లో వచ్చి ఇక్కడ మద్యం కొనుగోలు చేసుకొని అదే రైళ్లల్లో తిరిగి వెళ్తున్నారు. దీంతో ఇటు తడలోని మద్యం షాపులు కళకళలాడుతుంటే రైళ్లు ఈ మద్యం బాబులతో కిటకిటలాడుతున్నాయి.