Share News

చిత్తూరులో చిరుజల్లులు

ABN , Publish Date - May 22 , 2026 | 01:32 AM

ఉదయం నుంచి సాయంత్రం దాకా అధిక పగటి ఉష్ణోగ్రతలతో అల్లాడిన చిత్తూరు జనం.. సాయంత్రం కురిసిన చిరుజల్లులతో కాస్త ఉపశమనం పొందారు.

చిత్తూరులో చిరుజల్లులు

ఉదయం నుంచి సాయంత్రం దాకా అధిక పగటి ఉష్ణోగ్రతలతో అల్లాడిన చిత్తూరు జనం.. సాయంత్రం కురిసిన చిరుజల్లులతో కాస్త ఉపశమనం పొందారు. వర్షానికి ముందు సుమారు అరగంట పాటు వీచిన ఈదురుగాలులతో ప్రజలు భయకంపితులయ్యారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, అక్కడక్కడా చెట్లకొమ్మలు నేలకొరిగాయి. ఎండలకారణంగా మూగజీవాలు అల్లాడిపోయాయి. విజయపురం, నగరితో పాటు పలు మండలాల్లో పెనుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఎస్‌ఆర్‌పురంలో 10.8, వెదురుకుప్పంలో 3.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మే నెల జిల్లా సరాసరి వర్షపాతం 3.2 మి.మీ కాగా గురువారం నాటికి 51.7 మి.మీ వర్షం కురిసింది. చిత్తూరు రూరల్‌ మండలం తప్ప మిగిలిన 15 మండలాల్లో అధిక వర్షపాతం, 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

- చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి

Updated Date - May 22 , 2026 | 01:32 AM