మిగిలిన మూడు రోజులు వాడుకుందాం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:48 AM
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మూడు రోజుల గడువును ఓటర్లు, బీఎల్‌ఏలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు.
సుగవాసి ప్రసాద్‌బాబు
మదనపల్లె టౌన్, జూలై 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మూడు రోజుల గడువును ఓటర్లు, బీఎల్‌ఏలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక దేవతానగర్‌లోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 78 శాతమే ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశారని, ఇంకా రెండు లక్షలకుపైగా డిజిటలైజేషన్ చేయించాల్సి ఉందన్నారు. ఈనెల 14వ తేదీన గడువు ముగుస్తోందని, 1,334 మంది బూత్‌లెవల్ ఏజెంట్లు వారి పరిధిలో డిజిటలైజేషన్ చేయని వారిని గుర్తించి, బీఎల్‌వోల చేత ఈ ప్రక్రియ పూర్తి చేయించాలని అన్నారు. లేదంటే వారి ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జులు వారి పరిధిలోని బీఎల్‌ఏలను ఉత్తేజపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్‌ఖాన్, మాజీ అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ్, పి.సురేంద్రయాదవ్, సుదర్శన్‌రెడ్డి, అయూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.