Share News

టీడీపీని విజయపథంలో నడిపిద్దాం

ABN , Publish Date - Jan 09 , 2026 | 01:39 AM

టీడీపీని విజయపథంలో నడిపిద్దామని చిత్తూరు పార్లమెంటు నూతన అధ్యక్ష, కార్యదర్శులు షణ్ముగరెడ్డి, సునీల్‌కుమార్‌ చౌదరి పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, పలమనేరు, నగరి, చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఇప్పుడు వచ్చిన పదవులు తమ భాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. తమకీ అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు, సహకరించిన పార్లమెంటు పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందనడానికి తామే నిదర్శనమని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ గెలిపించాలని సూచించారు. ప్రమాణ స్వీకారం తర్వాత నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, చిత్తూరు, నగరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, గాలి భానుప్రకాష్‌, కలికిరి మురళి మోహన్‌లతో కలిసి ఎంపీ సన్మానించారు. ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ సురేష్‌ బాబు, చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ త్యాగరాజన్‌, మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌, నాయకులు చంద్రప్రకాష్‌, కోదండయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా చంద్రగిరి, పలమనేరు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, అమర్‌నాథరెడ్డి, థామస్‌, చిత్తూరు పార్లమెంటు పార్టీ మాజీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ వివిధ కారణాలతో కార్యక్రమానికి హాజరు కాలేదు.

టీడీపీని విజయపథంలో నడిపిద్దాం
ప్రమాణ స్వీకారం చేస్తున్న చిత్తూరు పార్లమెంటు టీడీపీ నూతన కమిటీ సభ్యులు

  • పార్టీ శ్రేణులకు చిత్తూరు పార్లమెంటు

నూతన అధ్యక్ష, కార్యదర్శుల పిలుపు

  • అట్టహాసంగా నూతన

కార్యవర్గ ప్రమాణ స్వీకారం

చిత్తూరు సిటీ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): టీడీపీని విజయపథంలో నడిపిద్దామని చిత్తూరు పార్లమెంటు నూతన అధ్యక్ష, కార్యదర్శులు షణ్ముగరెడ్డి, సునీల్‌కుమార్‌ చౌదరి పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా నిర్వహించారు. చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, పలమనేరు, నగరి, చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఇప్పుడు వచ్చిన పదవులు తమ భాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. తమకీ అవకాశమిచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు, సహకరించిన పార్లమెంటు పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సామాన్య కార్యకర్తలకు పెద్దపీట వేస్తుందనడానికి తామే నిదర్శనమని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ గెలిపించాలని సూచించారు. ప్రమాణ స్వీకారం తర్వాత నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, చిత్తూరు, నగరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్‌, గాలి భానుప్రకాష్‌, కలికిరి మురళి మోహన్‌లతో కలిసి ఎంపీ సన్మానించారు. ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ సురేష్‌ బాబు, చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ త్యాగరాజన్‌, మాజీ ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌, నాయకులు చంద్రప్రకాష్‌, కోదండయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా చంద్రగిరి, పలమనేరు, జీడీ నెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, అమర్‌నాథరెడ్డి, థామస్‌, చిత్తూరు పార్లమెంటు పార్టీ మాజీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ వివిధ కారణాలతో కార్యక్రమానికి హాజరు కాలేదు.

నూతన కమిటీ ఇలా..

అధ్యక్షుడు - షణ్ముగ రెడ్డి (నగరి), ప్రధాన కార్యదర్శి - వై.సునీల్‌ కుమార్‌ చౌదరి (పూతలపట్టు), ఉపాధ్యక్షులు - డి.దశరథవాసు (నగరి), సి.రామచంద్ర నాయుడు (పలమనేరు), ఆర్‌.నరసింహులు నాయుడు (పూతలపట్టు), యం.రవియాదవ్‌ (గంగాధరనెల్లూరు), కె.మైఖేల్‌ (చిత్తూరు), ఆర్‌.రమణారెడ్డి (చంద్రగిరి), నాగభూషణం రెడ్డి (కుప్పం), మంజులమ్మ (పలమనేరు), డి.ధనంజయులు నాయుడు (నగరి), కార్యనిర్వహక కార్యదర్శులు - ఎస్‌.అక్తర్‌ బాషా (చిత్తూరు), సుజాత (నగరి), ఎస్‌.సుబ్రహ్మణ్యం రెడ్డి (పలమనేరు), వేణుగోపాల్‌ (పూతలపట్టు), బి.అమ్ములు (చంద్రగిరి), నారాయణ (కుప్పం), టి.పూర్ణిమ (గంగాధరనెల్లూరు), కె.చెంగల్రాయరెడ్డి (గంగాధరనెల్లూరు), ఎ.మునార్‌ సాహెబ్‌ (చంద్రగిరి), అధికార ప్రతినిధులు - మునిభాస్కర్‌ రాజు (నగరి), టి.హేమగిరి (పూతలపట్టు), టి.మురళి మోహన్‌ (గంగాధరనెల్లూరు), బత్తిగౌడు (పలమనేరు), శశికర్‌ బాబు (చిత్తూరు), ఎం.వెంకటేష్‌ బాబు (చంద్రగిరి), పీసీ సాంబశివ (కుప్పం), బీఆర్‌.యుగంధర్‌ (నగరి), పులిచెర్ల మహేష్‌ (చంద్రగిరి), కార్యదర్శులుగా పి.రవి (పూతలపట్టు), సి.పరంధామ్‌ యాదవ్‌ (చంద్రగిరి), పద్మమ్మ (కుప్పం), టి.మంజు భారతి (నగరి), కె.ధరణి ప్రకాష్‌ (పూతలపట్టు) వి.జయలక్ష్మి (కుప్పం), ఎం.నాగిని (గంగాధరనెల్లూరు), ఎస్‌.పర్వీన్‌ (పలమనేరు), సి.విశ్వనాఽథ్‌ (పలమనేరు), ట్రెజరర్‌ - పీసీ స్వామి (గంగాధరనెల్లూరు), కార్యాలయ కార్యదర్శి - ఎన్‌.మోహన్‌రాజ్‌ (చిత్తూరు), మీడియా కో-ఆర్డినేటర్‌ - కె.ఉదయ్‌ కుమార్‌ (చిత్తూరు), సోషల్‌ మీడియా కో-ఆర్డినేటర్‌ - లత బాబునాయుడు (పూతలపట్టు).

Updated Date - Jan 09 , 2026 | 01:39 AM