‘బర్డ్’లో డాక్టర్లను నియమిద్దాం
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:16 AM
తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రిలో ఆర్థో, ఇన్ పేషెంట్ సేవలను బలోపేతం చేసేందుకు మరింత మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకానికి టీటీడీ ట్రస్టు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అంగీకారం తెలిపింది.
తిరుమల, డిసెంబరు31(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రిలో ఆర్థో, ఇన్ పేషెంట్ సేవలను బలోపేతం చేసేందుకు మరింత మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకానికి టీటీడీ ట్రస్టు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అంగీకారం తెలిపింది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ట్రస్టు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు నరే్‌షకుమార్, జానకిదేవి, బర్డ్ డైరెక్టర్ జగదీష్, హెచ్‌డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్ తదితరులు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బర్డ్‌లో భద్రత, పారిశుద్ధ్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులు కలిగి మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న రోగులలో ఏటా 100 నుంచి 150 మందికి అయ్యే పూర్తి ఖర్చును భరించడానికి ముందుకు వచ్చిన చెన్నైకు చెందిన గువీ హెల్త్ కేర్ ఛారిటబుల్ ట్రస్టు సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. అంతకుముందు హిందూధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై ఎగ్జిక్యూటివ్ కమిటి చర్చించింది.