Share News

ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళదాం

ABN , Publish Date - Jan 19 , 2026 | 02:08 AM

ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.ఈ సందర్భంగా షణ్ముగ రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి అధికారిక గుర్తింపు తీసుకురావడంలో ఎన్టీఆర్‌ పాత్ర మరువలేనిదన్నారు.ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌,చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత,మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు,చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి సునీల్‌ కుమార్‌ చౌదరి, అధికార ప్రతినిధులు సురేంద్ర కుమార్‌, సప్తగిరి ప్రసాద్‌,నేతలు చంద్ర ప్రకాష్‌,త్యాగరాజన్‌, మోహన్‌రాజ్‌, ఝాన్సీ వెంకటేష్‌ యాదవ్‌, కార్జాల అరుణ, నరేష్‌, మేషాక్‌, రాజశేఖర్‌, రాణి తదితరులు పాల్గొన్నారు.జిల్లావ్యాప్తంగా జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకల్లో నగరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్‌, మురళీమోహన్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళదాం
చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న పార్టీ నేతలు

చిత్తూరు సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ వర్ధంతిని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.ఈ సందర్భంగా షణ్ముగ రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి అధికారిక గుర్తింపు తీసుకురావడంలో ఎన్టీఆర్‌ పాత్ర మరువలేనిదన్నారు.ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌,చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత,మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు,చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి సునీల్‌ కుమార్‌ చౌదరి, అధికార ప్రతినిధులు సురేంద్ర కుమార్‌, సప్తగిరి ప్రసాద్‌,నేతలు చంద్ర ప్రకాష్‌,త్యాగరాజన్‌, మోహన్‌రాజ్‌, ఝాన్సీ వెంకటేష్‌ యాదవ్‌, కార్జాల అరుణ, నరేష్‌, మేషాక్‌, రాజశేఖర్‌, రాణి తదితరులు పాల్గొన్నారు.జిల్లావ్యాప్తంగా జరిగిన ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకల్లో నగరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్‌, మురళీమోహన్‌, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 02:08 AM