Share News

స్టార్టప్‌ సంస్కృతిని ప్రోత్సహిద్దాం

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:56 AM

స్టార్టప్‌ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా యువకుల్లో వినూత్న ఆలోచనలను వెలికి తీయొచ్చని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. యువతలో ఆవిష్కరణాత్మక ఆలోచనలు, పారిశ్రామిక దృక్పథం, స్టార్టప్‌ సంస్కృతి,పెట్టుబడులకు సిద్ధత పెంపొందించడమే లక్ష్యంగా తిరుపతిలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కచ్చపి ఆడిటోరియంలో స్టార్టప్‌ పిచ్చాథాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

స్టార్టప్‌ సంస్కృతిని ప్రోత్సహిద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న దీననాథ్‌

తిరుపతి సెంట్రల్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): స్టార్టప్‌ సంస్కృతిని ప్రోత్సహించడం ద్వారా యువకుల్లో వినూత్న ఆలోచనలను వెలికి తీయొచ్చని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. యువతలో ఆవిష్కరణాత్మక ఆలోచనలు, పారిశ్రామిక దృక్పథం, స్టార్టప్‌ సంస్కృతి,పెట్టుబడులకు సిద్ధత పెంపొందించడమే లక్ష్యంగా తిరుపతిలోని రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కచ్చపి ఆడిటోరియంలో స్టార్టప్‌ పిచ్చాథాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 300మంది విద్యార్థులు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, అధ్యాపకులు, పరిశ్రమ ప్రతినిధులు మరియు స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థకు చెందిన భాగస్వాములు పాల్గొన్నారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న జ్ఞాన్‌ సర్కిల్‌ వెంచర్స్‌ భాగస్వామి, స్టేషన్‌8ఎ్‌స వ్యవస్థాపకుడు దీనానాథ్‌ హరపనహళ్లి మాట్లాడుతూ వినూత్న ఆలోచనలు మాత్రమే కాకుండా సమర్థవంతమైన అమలు, వినియోగదారుల అవసరాలపై అవగాహన విజయవంతమైన స్టార్ట్‌పలకు కీలకమని పేర్కొన్నారు.స్టార్ట్‌పలకు అవసరమైన చట్టపరమైన సన్నద్ధత, మేధోసంపత్తి హక్కుల పరిరక్షణ, నియంత్రణ నిబంధనల అనుసరణ అంశాలపై లెక్స్‌స్టార్ట్‌ పార్ట్నర్స్‌కు చెందిన స్మితా రెడ్డి సూచనలందించారు. కెల్విన్వ్‌కే వ్యవస్థాపకుడు ప్రదీ్‌పకుమార్‌ సుందరరాజ్‌ తన పారిశ్రామిక ప్రయాణాన్ని వివరిస్తూ యువత వినూత్నంగా ఆలోచించాలని, సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 10 స్టార్ట్‌పలు తమ వినూత్న ఆలోచనలను జ్యూరీ సభ్యుల ముందుంచాయి. దీనానాథ్‌, స్మితా రెడ్డి, ప్రదీ్‌పకుమార్‌ సుందరరాజ్‌,విజయవంత్‌ మాథూర్‌, రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఇంక్యుబేషన్‌ విభాగాధిపతి ప్రగతి సభ్యులుగా ఉన్న జ్యూరీ ఆవిష్కరణ, వ్యాపార సాధ్యత, విస్తరణ అవకాశాలు, మార్కెట్‌ సామర్థ్యం, చట్టపరమైన సిద్ధత, అమలు వ్యూహాలు మరియు పెట్టుబడులకు సిద్ధత వంటి అంశాలపై సూచనలందించింది.

Updated Date - Jul 22 , 2026 | 01:56 AM