Share News

చైర్మన్‌ విజయాన్ని సీఎంకు కానుకగా ఇద్దాం

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:51 AM

పట్టణ సమగ్ర అభివృద్ధి, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మరింత పురోగతి సాధించేందుకు చైర్మన్‌ అభ్యర్థి జి.శ్రీరామ్‌చినబాబును గెలిపించాలని మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి ఓటర్లను కోరారు.

చైర్మన్‌ విజయాన్ని సీఎంకు కానుకగా ఇద్దాం
మాట్లాడుతున్న మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి

మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి

మదనపల్లె, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): పట్టణ సమగ్ర అభివృద్ధి, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మరింత పురోగతి సాధించేందుకు చైర్మన్‌ అభ్యర్థి జి.శ్రీరామ్‌చినబాబును గెలిపించాలని మంత్రి మండిపల్లె రామ్‌ప్రసాద్‌రెడ్డి ఓటర్లను కోరారు. శ్రీరామ్‌చినబాబును గెలిపిస్తే ఇక్కడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో కూటమి విజయాన్ని సీఎంకు అంకితం చేయాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మంత్రి కోరారు. పోలింగ్‌ జరిగే ఆదివారం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కేంద్రానికి తీసుకొచ్చి ఓట్లు వేయించాలని సూచించారు.

అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? : శ్రీరామ్‌చినబాబు

మదనపల్లె అభివృద్ధికి తనకు సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి జి.శ్రీరామ్‌చినబాబు పట్టణ ప్రజలను కోరారు. ఐదేళ్ల వైసీపీ పాలలో అరాచకం తప్పా..ఎక్కడా అభివృద్ధి జరగలేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని తనతోపాటు కూటమి కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని విజ్జప్తి చేశారు. పట్టణాభివృద్ధి డబులింజన్‌ సర్కార్‌తోనే సాధ్యమని ఆయన ఓటర్లకు సూచించారు.

Updated Date - Nov 01 , 2026 | 01:51 AM