ఉపాధ్యాయనగర్‌లో చిరుత సంచారం
ABN , Publish Date - Jun 14 , 2026 | 02:01 AM
తిరుపతిలోని ఉపాధ్యాయనగర్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం చిరుత సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
తిరుపతి(కపిలతీర్థం/నేరవిభాగం), జూన్ 13(ఆంధ్రజ్యోతి):తిరుపతిలోని ఉపాధ్యాయనగర్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం చిరుత సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.హోటల్ మారస సరోవర్ ఏరియాలో తిరిగిన చిరుత ఓ నీటి తొట్టె వద్ద ఆగింది. అందులో నీళ్లు లేకపోవడంతో తిరిగి అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది.అలాగే జీవకోనలోని బీడీకాలనీ, ఎస్‌ఎల్‌వీ నగర్‌కు సమీపంలో ఉన్న అటవీప్రాంతంలో కూడా శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చిరుత కన్పించడంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.తమ సిబ్బంది వెళ్లేలోపు అది అటవీప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు రేంజ్ ఆఫీసర్ సుదర్శన రెడ్డి తెలిపారు.చిరుత సంచరించిన ప్రాంతాల్లో రాత్రివేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.జనం కూడా చీకటిపడ్డాక వీలైనంత వరకూ బయటకు రావొద్దని సూచించారు.