చిప్పిలిలో చిరుత సంచారం!
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:43 AM
మదనపల్లె మండలం చిప్పిలిలో శనివారం చిరుత సంచరించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. గ్రామానికి చెందిన కృష్ణకిశోర్ పొలంలో చిరుత పాదముద్రలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
మదనపల్లె క్రైం, జూన్ 13(ఆంరఽధజ్యోతి) : మదనపల్లె మండలం చిప్పిలిలో శనివారం చిరుత సంచరించినట్లు పుకార్లు షికార్లు చేశాయి. గ్రామానికి చెందిన కృష్ణకిశోర్ పొలంలో చిరుత పాదముద్రలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌ఆర్‌వో జయప్రసాదరావు ఆదేశాలతో అటవీ, రెవెన్యూ అధికారులు చిప్పిలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అది చిరుత కాదని ప్రాథమిక నిర్ధారణ చేశారు. అయితే పూర్తి నిర్ధారణ అయ్యేవరకు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పులి పుకార్లతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పులి సంచారంపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి.