రికార్డుస్థాయికి నిమ్మ ధరలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 01:14 AM
నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుసోంది. మార్కెట్‌లో నిమ్మ కాయలు కిలో రూ.100 దాటి 120 వరకు చేరగా బస్తా నిమ్మకాయలు ఏకంగా రూ.10 వేలు పలుకుతున్నాయి.
కేజీ రూ.100 నుంచి రూ.120దాకా
డక్కిలి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) :నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుసోంది. మార్కెట్‌లో నిమ్మ కాయలు కిలో రూ.100 దాటి 120 వరకు చేరగా బస్తా నిమ్మకాయలు ఏకంగా రూ.10 వేలు పలుకుతున్నాయి.నిజానికి మార్చి రెండో వారం వరకు ధరలు లేక నిమ్మ రైతులు ఆందోళనకు లోనయ్యారు.ఇటీవల ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాల మార్కెట్‌లో నిమ్మకాయలకు గిరాకీ ఏర్పడడంతో నిమ్మకాయ ఐదు నుంచి ఆరు రూపాయలు పలుకుతోంది. నెలాఖరులో నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండడంతో తమ కష్టానికి దక్క ఫలితం లభించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.