చిత్తూరు డీఈవోగా లక్ష్మీనారాయణ
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:30 AM
చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి(ఎ్‌ఫఏసీ)గా కె.లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ డీఈవోగా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్ మే నెలలో పదవీ విరమణ చెందారు.
సమగ్రశిక్షలో ఏవో పోస్టు భర్తీ.. ఈఈ స్థానానికి ఇన్‌చార్జి
చిత్తూరు సెంట్రల్, జూలై 15(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి(ఎ్‌ఫఏసీ)గా కె.లక్ష్మీనారాయణను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ డీఈవోగా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్ మే నెలలో పదవీ విరమణ చెందారు. నెలన్నర పాటు పోస్టు ఖాళీగా ఉండటంతో ఏడీ వెంకటేశ్వరరావు ఇన్‌చార్జి డీఈవోగా వ్యవహరించారు. ఈ క్రమంలో పరిపాలన సౌలభ్యం కింద కృష్ణా జిల్లా అంగలూరు డైట్‌లో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న కె.లక్ష్మీనారాయణను పూర్తి అదనపు బాధ్యతలతో డీఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఈయన డీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఫ ఇక, సమగ్ర శిక్షలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న ఎస్టీవో (ట్రెజరీ) నాగరాజు 2025 నవంబరు 7న శ్రీసత్యసాయి జిల్లా ఖజానా శాఖకు బదిలీ అయ్యారు. ఈ స్థానంలో తవణంపల్లె మండలం ఎస్.కృష్ణాపురం జడ్పీహెచ్‌ఎ్‌స హెచ్‌ఎం హేమాద్రి.. డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డీసీఈబీ) కార్యదర్శి పోస్టుతో పాటు సమగ్రశిక్షలోని ఇన్‌చార్జి అకౌంట్స్ అధికారిగా ఇన్‌చార్జిగా పనిచేశారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఇందుకూర్‌పేట్ ఎస్టీవోగా పనిచేస్తున్న వీవీ రమణరావును జిల్లా సమగ్రశిక్షలో అకౌంట్స్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఫ ఇదే సమగ్రశిక్ష ఇంజనీరింగ్ విభాగంలో ఈఈగా పనిచేస్తున్న మధుసూదన్‌రావు ఏపీలో తన పదవీ కాలం ముగియడంతో తెలంగాణ రాష్ట్రం పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖకు 2025 అక్టోబరు నెలాఖరులో వెళ్లిపోయారు. తర్వాత మదనపల్లె సమగ్రశిక్షలోని ఏఈ సుధాకర్ బాబు ఇన్‌చార్జి ఈఈగా వచ్చారు. ఇప్పుడు వి.కోట పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివా్‌సను సమగ్రశిక్ష ఇంజనీరింగ్ విభాగం ఇన్‌చార్జి ఈఈగా నియమించారు.