Share News

కాన్వొకేషన్‌ కోసం వెళ్లి.. అమెరికాలో లక్కిరెడ్డిపల్లె విద్యార్థి మృతి

ABN , Publish Date - May 09 , 2026 | 01:51 AM

గోల్డెన్‌ గేటు యూనివర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేసుకుని కాన్వొకేషన్‌ అందుకున్న లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన మొహమ్మద్‌ కుమేల్‌ షేక్‌ (28) గుండెపోటుతో మృతి చెందాడు.

కాన్వొకేషన్‌ కోసం వెళ్లి..  అమెరికాలో లక్కిరెడ్డిపల్లె విద్యార్థి మృతి
మహమ్మద్‌ కుమేలి షేక్‌ (ఫైల్‌ఫొటో)

లక్కిరెడ్డిపల్లె, మే 8(ఆంధ్రజ్యోతి): గోల్డెన్‌ గేటు యూనివర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేసుకుని కాన్వొకేషన్‌ అందుకున్న మండలానికి చెందిన మొహమ్మద్‌ కుమేల్‌ షేక్‌ (28) గుండెపోటుతో మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన స్టాంప్‌ రైటర్‌ షేక్‌ తాజ్‌ కుమారుడు మొహమ్మద్‌ కుమేల్‌ షేక్‌ అమెరికాలోని గోల్డెన్‌ గేటు యూనివర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేశాడు. గురువారం రాత్రి కళాశాలలో కాన్వొకేషన్‌ అందుకుని ఇంటికి వెళ్లాడు. తెల్లారేసరికి గుండెపోటుతో మృతి చెందాడని అమెరికా నుంచి ఫోన్‌ వచ్చిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. చేతికొచ్చిన ఒకే ఒక్క కుమారుడు మృత్యువాత పడడంతో ఆ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి.

Updated Date - May 09 , 2026 | 01:51 AM