Share News

జాతీయ స్థాయి అవార్డుకు కుప్పం ఎంపిక

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:56 AM

జాతీయస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో నానాజీ దేశ్‌ముఖ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ (ఎన్‌డీఎ్‌సపీఎన్‌వీపీ)కు కుప్పం మండలం తృతీయ స్థానం సాధించింది.

జాతీయ స్థాయి అవార్డుకు కుప్పం ఎంపిక

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో నానాజీ దేశ్‌ముఖ సర్వోత్తమ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌ (ఎన్‌డీఎ్‌సపీఎన్‌వీపీ)కు కుప్పం మండలం తృతీయ స్థానం సాధించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నజరానా రూ.1.50 కోట్లు జమ చేసినట్లు డీపీవో సుధాకర్‌రావు బుధవారం తెలిపారు. కేంద్ర బృందం గతంలో కుప్పం మండలం నాయనూరు పంచాయతీలో పర్యటించిందన్నారు. ఆ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, మౌళిక వసతులు, ఇతర అంశాలపరంగా మెరుగ్గా ఉందని గుర్తించారు. దీంతో ఆ పంచాయతీతో పాటు కుప్పం మండలాన్ని ఒక బ్లాక్‌గా ఎంపిక చేసి జాతీయ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. ఈనెల 24న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును తీసుకుంటానని చెప్పారు. ఇందుకు సంబధించిన నజరానా మొత్తాన్ని కేంద్రం విడుదల చేసినట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని కుప్పం మండల పరిధిలోని పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామన్నారు. త్వరలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా త్వరలో ప్రచురించనున్నట్లు వెల్లడించారు.

Updated Date - Apr 09 , 2026 | 01:56 AM