Share News

జాతీయ అవార్డుకు ఎంపికైన కుప్పం బ్లాక్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:48 AM

పంచాయతీ పాలనలో నాయనూరుతో పాటు కుప్పం మండలాన్ని ఒక బ్లాకుగా నిర్ణయించి జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. ఇటీవల కేంద్ర బృందం కుప్పం మండలం నాయనూరు పంచాయతీలో పర్యటించింది.

జాతీయ అవార్డుకు ఎంపికైన కుప్పం బ్లాక్‌

జాతీయ అవార్డుకు ఎంపికైన కుప్పం బ్లాక్‌

24న ఢిల్లీలో అవార్డు బహూకరణ

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ పాలనలో నాయనూరుతో పాటు కుప్పం మండలాన్ని ఒక బ్లాకుగా నిర్ణయించి జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు. ఇటీవల కేంద్ర బృందం కుప్పం మండలం నాయనూరు పంచాయతీలో పర్యటించింది. అక్కడ ప్రజా అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పన, తాగునీరు పంపిణీ, రహదారుల నిర్మాణం, పారిశుధ్యం పచ్చదనం తదితర అంశాలను కేంద్ర బృందం పరిగణనలోకి తీసుకుంది. అన్ని పారామీటర్లలో అందించిన సేవలు ఉత్తమంగా, మెరుగ్గా ఉండటంతో ఆ పంచాయతీతో పాటు కుప్పం మండలాన్ని ఒక బ్లాక్‌గా నిర్ణయించి జాతీయ పురస్కారానికి కేంద్ర బృందం ఎంపిక చేసింది. ఏప్రిల్‌ 24వ తేది ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నట్లు డీపీవో సుధాకర్‌రావు తెలిపారు.

Updated Date - Apr 01 , 2026 | 01:48 AM