అటవీ అధికారిపై ‘కుంకీ’ దాడి
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:57 AM
రామకుప్పం మండలం ననియాల కౌండిన్య ఎలిఫెంట్ క్యాంపులో కుంకీ ఏనుగు వినాయక్ అటవీ అధికారిపై దాడి చేసినట్టు సమాచారం. కుంకీ ఏనుగు జయంత్ గత కొంతకాలంగా విరేచనాలతో బాధపడుతుండటంతో తిరుపతి జూపార్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
- స్వల్పగాయాలు
రామకుప్పం, జనవరి 4(ఆంధ్రజ్యోతి): రామకుప్పం మండలం ననియాల కౌండిన్య ఎలిఫెంట్ క్యాంపులో కుంకీ ఏనుగు వినాయక్ అటవీ అధికారిపై దాడి చేసినట్టు సమాచారం. కుంకీ ఏనుగు జయంత్ గత కొంతకాలంగా విరేచనాలతో బాధపడుతుండటంతో తిరుపతి జూపార్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దానిలో పాటూ మరో కుంకీ ఏనుగు వినాయక్‌కు కూడా మందులు అందిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వైద్యుడు వినాయక్‌కు మందు అందిస్తుండగా అది క్యాంపు పర్యవేక్షకుడిగా ఉన్న అటవీ అధికారిపై దాడి చేసింది. ఈ దాడిలో ఆ అధికారి కనుబొమ్మ, ముక్క వద్ద ఏనుగు దంతం తగిలి స్వల్పగాయాలయ్యాయి. అటవీ అధికారిపై కుంకీ ఏనుగు దాడి చేయలేదని, ప్రమాదవశాత్తు అతనికి ఏనుగు దంతం తగిలి, స్వల్పగాయాలయాయ్యని అటవీ విభాగాధికారి హరికుమార్ తెలిపారు. సాధారణంగా ఏనుగులు అక్టోబరు నుంచి జనవరి నెల వరకు మదంతో ఉంటాయని, మావటీలు తప్ప మరెవరైనా వెళితే అవి దురుసుగా ప్రవర్తించి దాడి చేసే అవకాశాలున్నాయన్నారు. అందుకే కుంకీ ఏనుగులకు దగ్గరగా పర్యాటకులనెవరినీ అనుమతించడం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి కుంకీ ఏనుగులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన తెలిపారు.