కృష్ణాష్టమి ముస్తాబు
ABN , Publish Date - Sep 02 , 2026 | 01:18 AM
శ్రీకృష్ణాష్టమి వేడుకలకు తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం ముస్తాబైంది.గురువారం నుంచి మూడు రోజులపాటు వేడుకలు జరగనున్నాయి. 3వ తేదీన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు గోపూజా మహోత్సవంతో శ్రీకారం చుట్టనున్నారు. 4న శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం, 5న ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల పభుపాదులకు అభిషేక పూజలు నిర్వహించనున్నారు.
తిరుపతి(కల్చరల్), సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణాష్టమి వేడుకలకు తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం ముస్తాబైంది.గురువారం నుంచి మూడు రోజులపాటు వేడుకలు జరగనున్నాయి. 3వ తేదీన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు గోపూజా మహోత్సవంతో శ్రీకారం చుట్టనున్నారు. 4న శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం, 5న ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల పభుపాదులకు అభిషేక పూజలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని విద్యుద్దీపకాంతులతో ఆలయం మెరిసిపోతోంది. హరేకృష్ణ రోడ్డు మార్గంలో స్వాగత ఆర్చిలు ఏర్పాటు చేశారు.