పుంగనూరు దాటిన కృష్ణా జలాలు
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:15 AM
హంద్రీనీవా కాల్వల ద్వారా శుక్రవారం పుంగనూరు నుంచి పెద్దపంజాణి మండలానికి కృష్ణాజలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించాయి. గురువారం రాత్రి నేతిగుట్లపల్లె పంప్‌హౌస్ ఎత్తిపోతల పథకం వరకు నీరు రాగా అధికారులు పంపింగ్ కోసం నిల్వ చేసి శుక్రవారం ఉదయం నుంచి ఒక మోటరు ద్వారా పంపింగ్ చేశారు.
పుంగనూరు, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి) : హంద్రీనీవా కాల్వల ద్వారా శుక్రవారం పుంగనూరు నుంచి పెద్దపంజాణి మండలానికి కృష్ణాజలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించాయి. గురువారం రాత్రి నేతిగుట్లపల్లె పంప్‌హౌస్ ఎత్తిపోతల పథకం వరకు నీరు రాగా అధికారులు పంపింగ్ కోసం నిల్వ చేసి శుక్రవారం ఉదయం నుంచి ఒక మోటరు ద్వారా పంపింగ్ చేశారు. ఇప్పటికే హెచ్‌ఎన్‌ఎ్‌సఎస్ అధికారులు కాల్వలకు సిమెంట్ ప్లాస్టింగ్ పనులు చేయించడంతో వచ్చిన నీరు ఆలస్యం లేకుండా ఉరకలేస్తూ కదిలాయి. సీఎం చంద్రబాబు చొరవతో హంద్రీనీవా కాల్వల ద్వారా నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు కాల్వల వద్దకు వెళ్లి పూజలు చేసి ఎల్‌నినో తీవ్ర ప్రభావంతో శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు రావడం సంతోషకరమైన విషయమన్నారు. పుంగనూరు-రామసముద్రం రోడ్డులోని ప్రసన్నయ్యగారిపల్లె హంద్రీనీవా కాల్వ వద్ద శనివారం ఉదయం 9 గంటలకు పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి వై.మధుసూదన్‌నాయుడు జలహారతి కార్యక్రమం చేపడుతారని ఆ పార్టీ నాయకుడు మధుసూదన్‌రాయల్ తెలిపారు.