జిల్లాలో చేరిన కోడూరు
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:12 AM
పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో విలీనమైంది.
తొలిరోజు కలెక్టర్ పర్యటన
రైల్వేకోడూరు, తిరుపతి డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలో విలీనమైంది. బుధవారం నుంచి అమల్లోకి రాగా, తొలిరోజే కలెక్టర్ వెంకటేశ్వర్ రైల్వేకోడూరులో పర్యటించారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ఆయనకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్, కుడా ఛైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, టీడీపీ నేత పంతగాని నరసింహప్రసాద్, జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర తదితరులు కలెక్టర్‌కు స్వవగతం పలికారు. ఐదుగురు తహసీల్దార్లు, ఇతర అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న భూములు, అటవీ భూములు, రోడ్ల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జిల్లా, డివిజన్ కేంద్రాల్లో వున్న రికార్డులన్నింటినీ తెప్పించాలని అధికారులను ఆదేశించారు. కాగా, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జిల్లా పేరు అన్నమయ్య స్థానంలో తిరుపతి బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో చేర్చడం ఆనందదాయకంగా ఉందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంతోషం వ్యక్తంచేశారు. తిరుపతి ఆర్డీవో రామ్మోహన్ కూడా ఉన్నారు.