Share News

అరసవెల్లికి బయలుదేరిన కాణిపాక ఆలయ ప్రచార రథం

ABN , Publish Date - Jan 22 , 2026 | 02:43 AM

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రచార రథం బుధవారం అరసవెల్లికి బయలుదేరింది. ఉదయం ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చి ప్రచార రథంలో ఉంచారు. అనంతరం ప్రచార రథాన్ని ఏఈవో రవీంద్రబాబు ప్రారంభించారు. అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో నిర్వహించే రథయాత్ర సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల ప్రచార రథాలు ఇక్కడికి విచ్చేయనున్నాయి. ఇందులో భాగంగా వరసిద్ధుడి ఆలయ ప్రచార రథం వెళుతోంది. ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు అరసవెల్లిలో ఉండి తిరిగి కాణిపాకానికి ప్రచార రథం చేరుకుంటుందని ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీనాయుడు, అర్చకుడు గణేష్‌ గురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు.

అరసవెల్లికి బయలుదేరిన కాణిపాక ఆలయ ప్రచార రథం
ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న ఏఈవో రవీంద్రబాబు

ఐరాల(కాణిపాకం), జనవరి 21 (ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రచార రథం బుధవారం అరసవెల్లికి బయలుదేరింది. ఉదయం ప్రధాన ఆలయంలో పూజలు నిర్వహించి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధుడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చి ప్రచార రథంలో ఉంచారు. అనంతరం ప్రచార రథాన్ని ఏఈవో రవీంద్రబాబు ప్రారంభించారు. అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో నిర్వహించే రథయాత్ర సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల ప్రచార రథాలు ఇక్కడికి విచ్చేయనున్నాయి. ఇందులో భాగంగా వరసిద్ధుడి ఆలయ ప్రచార రథం వెళుతోంది. ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు అరసవెల్లిలో ఉండి తిరిగి కాణిపాకానికి ప్రచార రథం చేరుకుంటుందని ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ వాసు, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీనాయుడు, అర్చకుడు గణేష్‌ గురుకుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 02:43 AM