వైభవంగా కల్యాణ వెంకన్న రథోత్సవం
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:08 AM
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆదివారం ఉదయం వైభవంగా నిర్వహించారు.
చంద్రగిరి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆదివారం ఉదయం వైభవంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణల నడుమ శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్యాణ వెంకన్న రథంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. సాయంత్రం ఉత్సవర్లకు ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. రాత్రి కల్కి అవతారంలో స్వామివారిని అశ్వ వాహనంపై అధిష్ఠింపజేసి, ఊరేగించారు. ఎస్‌ఈ మనోహరం, ఆలయ ప్రత్యేకాధికారి డాక్టర్ రవి, డిప్యూటీ ఈవో వరలక్ష్మి, వీజీవో సురేంద్ర, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్లు రమే్‌షకుమార్, రాజ్‌కుమార్, కంకణ భట్టర్ బాలాజీరంగాచార్యులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు చక్రస్నానం
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.