Share News

మణికంఠేశ్వరాలయంలో జ్వాలా తోరణం

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:56 AM

కాణిపాక క్షేత్రంలో మరగదాంబిక సమేత మణికంఠేశ్వరాలయంలో మంగళవారం సాయంత్రం జ్వాలా తోరణం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ఈవో పెంచలకిషోర్‌, సిబ్బంది, భక్తులు సహస్ర దీపాలను వెలిగించారు. ఆలయంలో లక్ష బిల్వార్చన కోసం ఉదయం ప్రధాన ఆలయ నుంచి ఈవో, సిబ్బంది పూజాసామగ్రి, బిల్వాలను తీసుకొచ్చి ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌కు అందించారు. అనంతరం రాత్రి ఆలయంలో పెద్ద ప్రమిదలో నేతి దీపాలను వెలిగించి ఆలయ ప్రదక్షణగా తీసుకొచ్చారు. ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలను వెలిగించారు. ఆలయ ఆవరణలో ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌ ఆధ్వర్యంలో జ్వాలా తోరణం వెలిగించారు. ఈ పూజలలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ ఏఈవో ధనపాల్‌, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు.

మణికంఠేశ్వరాలయంలో జ్వాలా తోరణం
జ్వాలా తోరణం కిందకు స్వామి ఉత్సవర్లను తీసుకొస్తున్న ఈవో పెంచలకిషోర్‌, ప్రధాన అర్చకులు

ఐరాల(కాణిపాకం), నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాణిపాక క్షేత్రంలో మరగదాంబిక సమేత మణికంఠేశ్వరాలయంలో మంగళవారం సాయంత్రం జ్వాలా తోరణం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ఈవో పెంచలకిషోర్‌, సిబ్బంది, భక్తులు సహస్ర దీపాలను వెలిగించారు. ఆలయంలో లక్ష బిల్వార్చన కోసం ఉదయం ప్రధాన ఆలయ నుంచి ఈవో, సిబ్బంది పూజాసామగ్రి, బిల్వాలను తీసుకొచ్చి ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌కు అందించారు. అనంతరం రాత్రి ఆలయంలో పెద్ద ప్రమిదలో నేతి దీపాలను వెలిగించి ఆలయ ప్రదక్షణగా తీసుకొచ్చారు. ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని వెలిగించారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలను వెలిగించారు. ఆలయ ఆవరణలో ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌గురుకుల్‌ ఆధ్వర్యంలో జ్వాలా తోరణం వెలిగించారు. ఈ పూజలలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ ఏఈవో ధనపాల్‌, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 01:56 AM