జూనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌గా వైజాగ్ జట్టు
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:53 AM
ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లెలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీ చాంపియన్‌గా వైజాగ్ జట్టు నిలిచింది.
మదనపల్లె టౌన్, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లెలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీ చాంపియన్‌గా వైజాగ్ జట్టు నిలిచింది. పట్టణంలోని మిషన్‌కాంపౌండు మైదానంలో సోమవారం నిర్వహించిన తొలి సెమిఫైనల్లో కర్నూలు జట్టుపై వైజాగ్ జట్టు 3-0 గోల్స్ సాధించి ఫైనల్‌కు చేరుకుంది. రెండో సెమీఫైనల్లో అనంతపురం జట్టు ఏలూరు జట్టుపై 2-0 గోల్స్ సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఏకపక్షంగా ఆధిపత్యం చూపించిన వైజాగ్ జట్టు 3-0 గోల్స్‌తో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో సుబ్రమణ్యం మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మధ్య దూరాన్ని తగ్గించి స్నేహాన్ని పెంచుతాయన్నారు. అనంతరం వైజాగ్ జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫుట్‌బాల్ కోచ్ సుధాకర్‌నాయుడు, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్, చంద్రకళ, కమలేష్, నరేష్‌బాబు, మహేంద్రనాయక్, కిరణ్ బాలాజి తదితరులు పాల్గొన్నారు.