Share News

15న శ్రీకాళహస్తిలో జాబ్‌మేళా

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:13 AM

రాష్ట్రనైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని జేఎన్‌టీయూ - స్కిట్‌ కళాశాలలో ఈనెల 15వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జేసీ గోవిందరావు తెలిపారు.

15న శ్రీకాళహస్తిలో జాబ్‌మేళా

తిరుపతి(కలెక్టరేట్‌)/శ్రీకాళహస్తి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రనైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని జేఎన్‌టీయూ - స్కిట్‌ కళాశాలలో ఈనెల 15వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జేసీ గోవిందరావు తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి లోకనాధంతో కలిసి జాబ్‌మేళాకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. శ్రీసిటీ, మేనకూరు సెజ్‌, ఈఎంసీ క్లస్టర్‌, తిరుపతి, చెన్నైలోని 30కి పైగా బహుళ జాతీయ కంపెనీల్లో 2వేలకుపైగా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 5వ తరగతిపైన, టెన్త్‌, ఇంటర్‌, ఐఐటీ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించిన యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 89198 89609, 79895 09540, 99888 53335 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Apr 12 , 2026 | 01:13 AM