వెంకన్న సేవలో జాన్వీ కపూర్
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:39 AM
హీరోయిన్ జాన్వీ కపూర్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్‌చరణ్‌తో నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల సందర్భంగా పిన్నమ్మ మహేశ్వరి, స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి కాలినడకన జాన్వీ కపూర్ తిరుమలకు వచ్చారు.
తిరుమల, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): హీరోయిన్ జాన్వీ కపూర్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రామ్‌చరణ్‌తో నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల సందర్భంగా పిన్నమ్మ మహేశ్వరి, స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి కాలినడకన జాన్వీ కపూర్ తిరుమలకు వచ్చారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన జాన్వీ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు.