42మందితో జనసేన సమన్వయ కమిటీ
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:39 AM
స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో జనసేన పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో మళ్ళీ కొత్తగా సమన్వయ కమిటీలను నియమించింది.తిరుపతి పార్లమెంటు కమిటీలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్, తిరుపతికి చెందిన గేట్ కాలేజీ కరస్పాండెంట్ టి.వెంకటేశ్వర్లు, ఆకేపాటి సుభాషిణి, శ్రీకాళహస్తికి చెందిన మిద్దెల హరి సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.
తిరుపతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో జనసేన పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో మళ్ళీ కొత్తగా సమన్వయ కమిటీలను నియమించింది.తిరుపతి పార్లమెంటు కమిటీలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్, తిరుపతికి చెందిన గేట్ కాలేజీ కరస్పాండెంట్ టి.వెంకటేశ్వర్లు, ఆకేపాటి సుభాషిణి, శ్రీకాళహస్తికి చెందిన మిద్దెల హరి సమన్వయకర్తలుగా నియమితులయ్యారు.సమన్వయ కమిటీలో మొత్తం 32 మంది సభ్యులుగా నియమితులయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే సత్యవేడు నుంచీ న్యాయవాది దాసు హేమకుమార్, పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్, గూడూరు నుంచీ ఎ.రమాదేవి, సర్వేపల్లి నుంచీ పెనుపాక ప్రసాద్, కోన రవిశంకర్, శ్రీకాళహస్తి నుంచీ అంజూరు చక్రధర్, చిన్నతోటి నాగరాజు, కళత్తూరు జయప్రకాష్, రాధమ్మ, వెంకటగిరి నుంచీ అరవ రాజేష్, తిరుపతి నుంచీ కొండా రాజమోహన్, తిప్పలింగం బాబ్జీ, డి.హేమకుమార్, జి.ఎస్, రమేష్ కుమార్, పగడాల మురళీ, ఆముదాల గిరిబాబు, హరిశంకర్ రావు, పెంచులయ్య, ఆర్.వెంకటేశ్, లోకేశ్ కమలాక్షి చంద్ర, కారుమంచి మధుసూదన రావు, కె.మునివెంకటసాయి దేవ్, వేణుగుంట కుమార్, చంద్రశేఖర్, పులి శ్రీనివాసులు, సి. శైలజ, బి.వెంకటేశ్, పల్లూరు రాజా, బసవనూరు భాస్కర్, గుమ్మినేని వాణి భవానీ, మైనంపాటి చలపతి తదితరులున్నారు. అలాగే ఐదుగురితో కూడిన సపోర్ట్ టీమ్‌లో ఉప్పు సాయి కిరణ్, రామిశెట్టి కిరణ్ (శ్రీకాళహస్తి), శెట్టిపల్లి యశ్వంత్, ఎ.రవిప్రకాష్ (తిరుపతి), గోపీ కృష్ణ (సూళ్ళూరుపేట) సభ్యులుగా వున్నారు.
గత కమిటీ నుంచీ ముగ్గురికే మళ్ళీ చోటు
నెలన్నర కిందట జనసేన అధిష్ఠానం ప్రకటించిన పార్లమెంటు సమన్వయ కమిటీని రద్దు చేసి తాజాగా కొత్త కమిటీని నియమించిన నేపధ్యంలో మునుపటి కమిటీ నుంచీ కేవలం ముగ్గురు మాత్రమే కొత్త కమిటీలో స్థానం నిలుపుకున్నారు. సమన్వయకర్తగా కిరణ్ రాయల్, కమిటీ సభ్యులుగా చిన్నతోటి నాగరాజు, బాబ్జీలు కొత్త కమిటీలోనూ కొనసాగుతున్నారు.సమన్వయ క్రికెట్ విజయ్‌కుమార్, కీర్తనలకు కొత్త కమిటీలో స్థానం దక్కలేదు.