జోరుగా జల్లికట్టు
ABN , Publish Date - Jan 18 , 2026 | 01:21 AM
పశువుల పండగను పురస్కరించుకుని మండలంలోని మల్లయ్యపల్లె, దోర్నకంబాల, మండపంపల్లె గ్రామాలలో శనివారం జల్లికట్టు నిర్వహించారు.
చంద్రగిరి, జనవరి 17(ఆంద్రజ్యోతి): పశువుల పండగను పురస్కరించుకుని మండలంలోని మల్లయ్యపల్లె, దోర్నకంబాల, మండపంపల్లె గ్రామాలలో శనివారం జల్లికట్టు నిర్వహించారు. స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు తరలిరావడంతో ఆయా గ్రామాల్లో తిరునాళ్ల వాతావరణం కనిపించింది. ఆవులు, కోడెగిత్తల కొమ్ములకు రంగులు పూసి, అలంకరించారు. చెక్కపలకలు కట్టారు. డప్పులు వాయించి, అల్లివైపు తరిమారు. కోడెగిత్తలను నిలువరించి పలకలను సొంతం చేసుకునేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. చివరిగా పలకలను దక్కించుకున్న యువకులు విజయగర్వంతో పొంగిపోయారు. చంద్రగిరి సీఐ సురే్‌షకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, అనుప్పల్లి-చంద్రగిరి మార్గంలో వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది.