చిన్నరామాపురంలో జల్లికట్టు
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:42 AM
చంద్రగిరి మండలం చిన్నరామాపురంలో ఆదివారం జల్లికట్టు (పశువుల పండగ) జరిగింది. పశువుల పండుగ(జల్లికట్టు) అట్టహాసంగా నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచీ పశువులను చిన్నరామాపురం తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చంద్రగిరి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలం చిన్నరామాపురంలో ఆదివారం జల్లికట్టు (పశువుల పండగ) జరిగింది. పశువుల పండుగ(జల్లికట్టు) అట్టహాసంగా నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచీ పశువులను చిన్నరామాపురం తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడెగిత్తలు, ఆవులు, దూడలకు కొమ్ములు చెలిగి, రంగులేసి సినీనటులు, దేవుళ్లు, నేతల ఫొటోలను, చెక్క పలకలతో పాటు, నగదు, వస్తు సామగ్రిని కట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నడివీధిలో పశువులను అల్లెలోకి వదిలారు. వీటిని నిలువరించి బహుమతులు సొంతం చేసుకునేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో వీరి మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పశువులను నిలువరించే క్రమంలో కిందపడటంతో పలువురికి గాయాలయ్యాయి.