Share News

‘జలధార- జలహారతి’ పనులు వేగంగా పూర్తిచేయాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:44 AM

చిత్తూరు జిల్లాలో ‘జలధార - జల హారతి’ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. ఈ పనుల పురోగతిని సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం కలెక్టర్లతో సమీక్షించారు.

‘జలధార- జలహారతి’ పనులు వేగంగా పూర్తిచేయాలి
సీఎం వీడియో కాన్ఫరెన్సులో చిత్తూరు నుంచి పాల్గొన్న కలెక్టర్‌, ఇతర అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘జలధార - జల హారతి’ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. ఈ పనుల పురోగతిని సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం కలెక్టర్లతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కింద జిల్లాలో జలసంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా వంద రోజుల ప్రత్యేక కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. చెరువులకు నీళ్లు చేరే ఫీడర్‌ ఛానెళ్ల పునరుద్ధరణ ద్వారా అన్ని చెరువులను పూర్తిస్థాయిలో నింపి భూగర్భ జలాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలో 3,106 చెరువులు, 3,935 ఫీడర్‌ ఛానెళ్ళు, 665 క్యాస్కేడ్‌లు ఉన్నాయి. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌, డ్వామా పీడీ విజయ్‌ కుమార్‌, ఇరిగేషన్‌, గ్రౌండ్‌ వాటర్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 01:44 AM