ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని జగన్
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:47 AM
ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని ఏకైక మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని శాప్ చైర్మన్ రవినాయుడు ఎద్దేవా చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌కు నిజాలు మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందని అతడి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచించాడని, అందువల్ల ఆయన నోట అబద్దాలు తప్ప నిజాలు రావన్నారు.
శాప్ చైర్మన్ రవినాయుడు
తిరుపతి(కపిలతీర్థం), ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని ఏకైక మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని శాప్ చైర్మన్ రవినాయుడు ఎద్దేవా చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌కు నిజాలు మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందని అతడి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సూచించాడని, అందువల్ల ఆయన నోట అబద్దాలు తప్ప నిజాలు రావన్నారు. గురువారం మీడియా సమావేశంలో జగన్ మాట్లాడిన ప్రతి మాటా అబద్ధమేనన్నారు.డీఎస్సీ అభ్యర్థులు, ఆ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు చెబుతున్నా పదేపదే జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సచివాలయ ఉద్యోగాల నియామకాలపై, డీఎస్సీ నియమకాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. టెట్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఏ ప్రక్రియలో ఏ సంస్థ ద్వారా ఉద్యోగాలు వస్తాయో తెలియని జగన్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయడం సిగ్గుచేటన్నారు.గ్రూ్‌ప-1పై సిట్ నివేదికలో నిజాలు బయటపడుతున్న కొద్దీ డీఎస్సీని తెరపైకి తెస్తున్నాడన్నారు. అవినా్‌షరెడ్డి ఇంటిపై ఎప్పుడో ఈడీ సోదాలు చేసుంటే బాగుండేదన్నారు. ఈ సమావేశంలో మహే్‌షయాదవ్, తోట వాసు, వెంకట్ మొదలియార్, శ్రీధర్, కొట్టే హేమంత్, గంజి సుధాకర రెడ్డి, మునిరామయ్య తదితరులు పాల్గొన్నారు.