Share News

రాయలసీమ ద్రోహి జగన్‌

ABN , Publish Date - Jul 05 , 2026 | 01:27 AM

రాయలసీమ ద్రోహి మాజీ సీఎం జగన్‌రెడ్డి అని చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీ మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపించారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం వీరు మీడియా సమావేశంలో మాట్లాడారు. గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనంతా విధ్వంసం, దౌర్జన్యాలతోనే సాగిందన్నారు. వీరి బెదిరింపులతో 19 కియా అనుబంధ సంస్థలను, అమర రాజా కంపెనీని రాయలసీమ నుంచి తరిమేశారన్నారు. నిర్మాణ దశలోన 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దుచేశారన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ను రద్దుచేసి రైతులకు ద్రోహం చేశారన్నారు. ఇప్పుడు మావిగన్‌ పేరుతో మరో నాటకానికి వైసీపీ తెరతీసిందన్నారు

రాయలసీమ ద్రోహి జగన్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్‌

  • ఎమ్మెల్యేలు నాని, మురళీమోహన్‌

చిత్తూరు సిటి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ద్రోహి మాజీ సీఎం జగన్‌రెడ్డి అని చంద్రగిరి, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీ మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆరోపించారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం వీరు మీడియా సమావేశంలో మాట్లాడారు. గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాలనంతా విధ్వంసం, దౌర్జన్యాలతోనే సాగిందన్నారు. వీరి బెదిరింపులతో 19 కియా అనుబంధ సంస్థలను, అమర రాజా కంపెనీని రాయలసీమ నుంచి తరిమేశారన్నారు. నిర్మాణ దశలోన 102 సాగునీటి ప్రాజెక్టులను రద్దుచేశారన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ను రద్దుచేసి రైతులకు ద్రోహం చేశారన్నారు. ఇప్పుడు మావిగన్‌ పేరుతో మరో నాటకానికి వైసీపీ తెరతీసిందన్నారు. ఇప్పుడు కూటమి పాలనలో రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల్లో మూడో వంతు రాయలసీమకే వస్తున్నాయని తెలిపారు. రెండేళ్లలో రూ.4.58 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.76 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టారని వివరించారు. రూ.16,350 కోట్లతో ఉక్కు పరిశ్రమను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారన్నారు. ఐదేళ్లలో రెండు సార్లు కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన జగన్‌ కనీసం ప్రహరీ కూడా నిర్మించకుండానే క్రెడిట్‌ చోరీకి పాల్పడడం సిగ్గు చేటన్నారు. లక్ష కోట్లతో చేపట్టబోయే మిషన్‌ రాయలసీమ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం కాబోతోందని అన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 01:27 AM