Share News

కడప జోన్‌ ఇన్‌చార్జి ఈడీగా జగదీష్‌

ABN , Publish Date - Aug 01 , 2026 | 02:00 AM

ఆర్టీసీ కడప జోన్‌ ఇన్‌చార్జి ఈడీగా ఎం.జగదీ్‌షను, తిరుపతి ఇన్‌చార్జి డీపీటీవోగా కె.శ్రీనివాసరావును నియమిస్తూ విజయవాడ ప్రధాన కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.

కడప జోన్‌ ఇన్‌చార్జి ఈడీగా జగదీష్‌

తిరుపతి ఇన్‌చార్జి డీపీటీవోగా శ్రీనివాసరావు

తిరుపతి అర్బన్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ కడప జోన్‌ ఇన్‌చార్జి ఈడీగా ఎం.జగదీ్‌షను, తిరుపతి ఇన్‌చార్జి డీపీటీవోగా కె.శ్రీనివాసరావును నియమిస్తూ విజయవాడ ప్రధాన కార్యాలయం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు ఈడీగా ఉన్న ఎస్‌టీపీ రాఘవకుమార్‌ విజయవాడ ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్‌ ఈడీగా బదిలీచేసింది. అలాగే తిరుపతి డీపీటీవో స్థానంలో విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎంఈగా వున్న కె.శ్రీనివాసరావును ఇన్‌చార్జిగా నియమించింది. వీరిద్దరూ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

పీవోగా సహజాద్‌

చిత్తూరు పర్సనల్‌ ఆఫీసర్‌(పీవో)గా ఉన్న ఆర్‌.సహజాద్‌ను తిరుపతి పీవోగా నియమించారు. ఇక్కడున్న చాందినిని విజయవాడకు బదిలీ చేశారు. అలాగే తిరుమల ఇన్‌చార్జి డిపో మేనేజర్‌గా అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉన్న ఏవీ రమణను నియమించారు.

Updated Date - Aug 01 , 2026 | 02:00 AM