Share News

వానొచ్చింది!

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:13 AM

తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం రాత్రి అర్ధగంటకు పైగా వర్షం కురిసింది

  వానొచ్చింది!

తిరుపతి అర్బన్‌/చంద్రగిరి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): తిరుపతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం రాత్రి అర్ధగంటకు పైగా వర్షం కురిసింది.పగలంతా ఎండతీవ్రత కొనసాగడంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీచాయి.నీలిమబ్బులు కమ్ముకున్నాయి.దాదాపు రెండు గంటల తరువాత రాత్రి 8.15గంటలకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలై అర్ధగంట కురిసింది. చంద్రగిరిలో బుధవారం రాత్రి 9.30 గంటల నుంచి 10 గంటల వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. ఎ.రంగంపేట, బందార్లపల్లెల్లో వడగండ్ల వాన కురిసింది.

Updated Date - Mar 19 , 2026 | 02:14 AM