Share News

వరసిద్ధుడి ఆలయానికి ఐఎ్‌సవో సర్టిఫికెట్‌

ABN , Publish Date - Jan 01 , 2026 | 01:02 AM

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయానికి ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ లభించింది.ఆలయ నిర్వహణ, క్యూలైన్ల పర్యవేక్షణ, పరిశుభ్రత, ప్రసాదం తయారీ విధానం, అన్నదానం, పడితరం స్టోర్స్‌ నిర్వహణ తదితరాలను పరిశీలించి సంతృప్తి చెందితే ఈ సర్టిఫికెట్‌ ఇస్తారని ఎమ్మెల్యే మురళీమోహన్‌ తెలిపారు.

వరసిద్ధుడి ఆలయానికి ఐఎ్‌సవో సర్టిఫికెట్‌

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 31(ఆంద్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధుడి ఆలయానికి ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ లభించింది.ఆలయ నిర్వహణ, క్యూలైన్ల పర్యవేక్షణ, పరిశుభ్రత, ప్రసాదం తయారీ విధానం, అన్నదానం, పడితరం స్టోర్స్‌ నిర్వహణ తదితరాలను పరిశీలించి సంతృప్తి చెందితే ఈ సర్టిఫికెట్‌ ఇస్తారని ఎమ్మెల్యే మురళీమోహన్‌ తెలిపారు.హెచ్‌వైఎం సంస్థ సీఈవో శివయ్య సర్టిఫికెట్‌ను అందజేసినట్లు తెలిపారు.ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ప్రథమంగా క్యూ3 స్టార్‌ సర్టిఫికెట్‌ రావడం సంతోషకరమన్నారు.ఆలయ అధికారులు, సిబ్బంది కృషి కారణంగా ఆలయానికి ఈ ఘనత లభించిందన్నారు.ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్‌, బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, చల్లకృష్ణవేణి, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్‌ కోదండపాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2026 | 01:02 AM